ఖాళీ ప్రదేశాలలో చెత్త వేస్తే అపరాధ రుసుం వసూలు

ABN , First Publish Date - 2021-12-30T05:58:42+05:30 IST

ఖాళీ ప్రదేశాలలో చెత్త వేసిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా సిబ్బందికి సూచించారు.

ఖాళీ ప్రదేశాలలో చెత్త వేస్తే అపరాధ రుసుం వసూలు
మిందిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాలీలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా

జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీ షా

అక్కిరెడ్డిపాలెం. డిసెంబరు 29: ఖాళీ ప్రదేశాలలో చెత్త వేసిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌  లక్ష్మీషా సిబ్బందికి సూచించారు. 68వ వార్డు పరిధి మిందిలో బుధవారం ఆయన పర్యటించారు. కాలనీలోని కాలువలను, ఖాళీ ప్రదేశాలను, నిరుపయోగంగా వున్న బావులను ఆయన పరిశీలించారు. కాలువల్లో చెత్త తీయడంలో పారిశుధ్య సిబ్బంది చూపుతున్న నిర్లక్షంపై ఆయన ఆగ్రహం వ్యక్తపరిచారు. నిరుపయోగంగా వున్న బావులలో దోమలు వ్యాప్తి చెందే అవకాశం వున్నందున తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కాలనీలో పలు రహదారుల మరమ్మతులు చేపట్టాలని  వార్డు కార్పొరేటర్‌ గుడివాడ అనూష కమిషనర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కాలనీలో  కమిషనర్‌ లక్ష్మీషా మొక్కలు నాటారు. అనంతరం కాలనీలో స్వచ్చ సర్వేక్షణ్‌ ర్యాలీని ఆయన ప్రారంభించారు.  ఈ పర్యటనలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, జోనల్‌ కమిషనర్‌ డి.శ్రీధర్‌, ఏడీ దామోదరరావు, స్థానిక నాయకులు గుడివాడ లతీశ్‌, వరదాడ రమణ, సండ్రాన నూకరాజు, ఈటి సురేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T05:58:42+05:30 IST