అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం శుభపరిణామం
ABN , First Publish Date - 2021-05-21T04:19:15+05:30 IST
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం శుభపరిణామమని ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం ఉక్కు అమరవీరుల స్తూపం వద్ద నినాదాలు చేశారు.

ఉక్కుటౌన్‌షిప్, మే 20: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం శుభపరిణామమని ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం ఉక్కు అమరవీరుల స్తూపం వద్ద నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో గొందేశి సత్యారావు, పులివెంకటరమణారెడ్డి, యేల్లేటి శ్రీనివాస్, జెర్రిపోతుల ముత్యాలు, మంత్రి గోపినారాయణ, దొమ్మేటి అప్పారావు పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం శుభపరిణామమని ఇంటక్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజశేఖర్, గంధం వెంటకరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హర్షం తెలిపిన కార్మిక సంఘాలు
వేపగుంట: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఏకగ్రీవ తీర్మానం చేయడంపై పలు కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్, వైఎస్‌ఆర్‌ిసీపీ పోర్టు యూనియన్ నాయకుడు ఎస్.గోవింద్‌పట్నాయక్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.