బాక్సింగ్‌లో ‘బుల్లయ్య’ క్రీడాకారిణుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-08T04:38:28+05:30 IST

రాష్ట్ర స్థాయి సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నీలో లంకపల్లి బుల్లయ్య కళాశాల విద్యార్థులు స్వర్ణపతకాలు సాధించారు.

బాక్సింగ్‌లో ‘బుల్లయ్య’ క్రీడాకారిణుల ప్రతిభ
క్రీడాకారిణులతో బుల్లయ్య కళాశాల ప్రతినిధులు

విజేతలను అబినందించిన యాజమాన్యం

విశాఖపట్నం (స్పోర్ట్సు), అక్టోబరు 7: రాష్ట్ర స్థాయి సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నీలో లంకపల్లి బుల్లయ్య కళాశాల విద్యార్థులు స్వర్ణపతకాలు సాధించారు. పోర్టు స్టేడియంలో జరిగిన ఈ టోర్నీ 48 కిలోల విభాగంలో జి.జ్యోతి, 50 కిలోల కేటగిరిలో జి.రమ్య, 81 ప్లస్‌ కిలోల విభాగంలో ఎస్‌.సిరి చందన బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. కళాశాల కరస్పాండెంట్‌, కార్యదర్శి జి.మధుకుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.ఎస్‌.కె.చక్రవర్తి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.శ్రీకాంత్‌, పీడీలు డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, డాక్టర్‌ బీఆర్‌ఎస్‌.లక్ష్మణరెడ్డిలు గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతలను అభినందించారు.


Updated Date - 2021-10-08T04:38:28+05:30 IST