హోంగార్డుల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-12-07T06:06:29+05:30 IST

హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో సోమవారం హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం జరిగింది.

హోంగార్డుల సేవలు అభినందనీయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కృష్ణారావు

జిల్లా ఎస్పీ కృష్ణారావు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 6: హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో సోమవారం హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కరోనాలో మృతి చెందిన హోంగార్డు, దివంగత మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య మృతికి మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 1949లో చైనాతో భారతదేశం యుద్ధం చేసే సమయంలో మొదటిసారిగా హోంగార్డులను తెరపైకి తీసుకువచ్చారన్నారు. హోంగార్డుల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా డిసెంబరు 6న హోంగార్డు రైజింగ్‌ డే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 609 మంది హోంగార్డులు పనిచేస్తుండగా, వారిలో 84 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు చేస్తున్న సేవలు అందిస్తున్నారని  కొనియాడారు. కరోనా కారణంగా మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటామని, వారి కుమారుడికి హోంగార్డుగా ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెపారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ ఆర్‌పీఎల్‌ శాంతికుమార్‌, అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌, పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు, ఆర్‌ఐలు బి.రామకృష్ణారావు, కె.వెంకటరావు, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:06:29+05:30 IST