సంక్షేమ పథకాల అమలు బాధ్యత కార్యదర్శులదే..

ABN , First Publish Date - 2021-08-28T04:16:26+05:30 IST

గ్రామాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేసే బాధ్యత కార్యదర్శులదేనని ఎంపీడీవో రమేశ్‌నాయుడు అన్నారు.

సంక్షేమ పథకాల అమలు బాధ్యత కార్యదర్శులదే..
మాట్లాడుతున్న ఎంపీడీవో రమేశ్‌నాయుడు

సబ్బవరం, ఆగస్టు 27 : గ్రామాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేసే బాధ్యత కార్యదర్శులదేనని ఎంపీడీవో రమేశ్‌నాయుడు అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యదర్శులు చూడాలన్నారు. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాల భవనాలు, సచివాలయాల భవన నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దశలవారీగా ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలన్నారు.  సచివాలయాల సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు గ్రీవెన్స్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో షేక్‌ బాబూరావు, వ్యవసాయాధికారి పోతల సత్యనారాయణ, ఈవోపీఆర్‌డీ ఓ. మహేశ్‌, మండల ఏఈ అర్జునఅప్పారావు, హౌసింగ్‌ ఏఈ శేఖర నాయుడు, కార్యదర్శి మహాలక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-28T04:16:26+05:30 IST