ప్రభుత్వరంగ సంస్థల విక్రయం దుర్మార్గం

ABN , First Publish Date - 2021-10-21T06:10:35+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు పడాల రమణ అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల విక్రయం దుర్మార్గం
రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న పడాల రమణ

ఏఐటీయూసీ నాయకుడు పడాల రమణ

కూర్మన్నపాలెం, అక్టోబరు 20: ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు  పడాల రమణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 251వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షా శిబిరానికి రమణ విచ్చేసి, సంఘీభావం తెలిపారు. అనంతంర ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీని గొప్ప సేల్స్‌మన్‌గా అభివర్ణించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షాలను కలుపుకొని ఉద్యమాలు చేయాలే తప్ప, ఉత్తి ఉత్తరాలు రాస్తూ కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, అయోధ్యరామ్‌, గంధం వెంకటరావు,  కె.సత్యనారాయణ, గోపి, ప్రసాద్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T06:10:35+05:30 IST