గంగవరం పోర్టు వాటాల విక్రయం దుర్మార్గం

ABN , First Publish Date - 2021-08-28T05:21:18+05:30 IST

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలను విక్రయించడం దుర్మార్గమని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

గంగవరం పోర్టు వాటాల విక్రయం దుర్మార్గం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, ఆగస్టు 27: గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలను విక్రయించడం దుర్మార్గమని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గంగవరం గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ గంగవరం పోర్టు నిర్మాణానికి జీవనాధారం కోల్పోయిన మత్య్సకారులకు జెట్టీ నిర్మాణం, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ వంటి ప్రధానాంశాలు పట్టించుకోకుండా అదానికి అప్పగించారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటాలు తప్పవన్నారు. ఈ సభలో స్థానిక నాయకులు పులి వెంకటరమణారెడ్డి, కొవిరి హరికృష్ణ, కదిరి పోలరాజు, అమ్మోరు, నర్సింగ్‌, దేముడు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-28T05:21:18+05:30 IST