ప్రజాకంటక పాలనకు స్వస్తి పలకాలి

ABN , First Publish Date - 2021-12-30T06:10:58+05:30 IST

ప్రజాకంటక పాలనకు అంతా స్వస్తి పలకాలని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని మోసయ్యపేటలో బుధవారం ఏర్పాటైన టీడీపీ గౌరవ సభలో మాట్లాడారు.

ప్రజాకంటక పాలనకు స్వస్తి పలకాలి
మోసయ్యపేటలో మాట్లాడుతున్న ప్రగడ నాగేశ్వరరావు

 ప్రగడ నాగేశ్వరరావు

అచ్యుతాపురం/రూరల్‌, డిసెంబరు 29: ప్రజాకంటక పాలనకు అంతా స్వస్తి పలకాలని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని మోసయ్యపేటలో బుధవారం ఏర్పాటైన టీడీపీ గౌరవ సభలో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కక్షసాధింపు చర్యలకు మాత్రమే వైసీపీ పాలకులు ప్రాధా న్యం ఇస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నా  పట్టించు కోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల సినిమా థియేటర్లు మూతపడుతూ అందులోని కార్మికులు రోడ్డున పడుతున్నారని వాపోయారు. ఓటీఎస్‌ పేరిట పేదలను వేధించడం తగదన్నారు.  టీడీపీ నేతలు రాజాన రమేష్‌కుమార్‌, డి.నాయుడుబాబు (డ్రీవ్స్‌ నాయుడు), కె.రమణ, డి.రఘు, కొయ్య శ్రీను, పుర్రే శ్రీనివాసయాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T06:10:58+05:30 IST