నల్లచట్టాల రద్ద్దు రైతుల విజయమే

ABN , First Publish Date - 2021-11-26T05:30:00+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతు ఉద్యమ విజయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ అన్నారు. మద్దిలపాలెం కూడలిలో శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు.

నల్లచట్టాల రద్ద్దు రైతుల విజయమే
సత్యాగ్రహ దీక్ష చేస్తున్న వామపక్ష కార్యకర్తలు

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి  జేవీ సత్యనారాయణ

మద్దిలపాలెం, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతు ఉద్యమ విజయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి  జేవీ సత్యనారాయణ అన్నారు. మద్దిలపాలెం కూడలిలో శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు.  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020 నవంబరు 26 నుంచి రైతులు ఉద్యమం ప్రారంభించారన్నారు. ఈ చట్టాల రద్దుతో పాటు ఉద్యమంలో మృతిచెందిన రైతులకు నష్టపరిహారం, పంటలకు గిట్టుబాటు ధరల గ్యారెంటీ చట్టం అమలుచేయాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. రైతులను కారుతో తొక్కించిన ఘటనలో కేంద్ర సహాయమంత్రి అజయ్‌మిశ్రాను భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, సీపీఐ నగర కార్యదర్శి పైడిరాజు, వామపక్ష నాయకులు పైడయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-11-26T05:30:00+05:30 IST