పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-10-29T06:18:17+05:30 IST
ప్రభుత్వం పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్ డిమాండ్ చేశారు.
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్
చోడవరం, అక్టోబరు 28: ప్రభుత్వం పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్ డిమాండ్ చేశారు. మండలంలోని వివిధ పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ, ఎంతో కాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నప్పటికీ పీఆర్‌సీని ప్రభుత్వం ప్రకటించకపోవడం సరికాదన్నారు. అలాగే సీపీఎస్ విధానం రద్దుపైనా నిర్ణయం తీసుకోవాలని, ఉపాధ్యాయులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్న యాప్‌ల వేధింపులు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల జడ్పీ పీఎఫ్ జమలు సకాలంలో జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు సింహాద్రి, ఎ.జయప్రకాశ్, అడగళ్ల సత్యంనాయుడు, కేఎల్ గణేశ్వరరావు, ఎం.వసుంధరాదేవి, గూనూరు శ్రీను, ఇమంది ప్రసాద్, ఎంవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.