తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-02-05T07:14:18+05:30 IST

నియోజకవర్గం పరిధిలోని నామినేషన్ల ఉపసంహరణ జరిగిన రెండు మండలాల్లో తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవం

బుచ్చెయ్యపేటలో ఆరు.. చోడవరంలో మూడు


చోడవరం/బుచ్చెయ్యపే, ఫిబ్రవరి 4: నియోజకవర్గం పరిధిలోని నామినేషన్ల ఉపసంహరణ జరిగిన రెండు మండలాల్లో తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో బుచ్చెయ్యపేటలో ఆరు, చోడవరంలో మూడు ఉన్నాయి. సర్పంచ్‌ అభ్యర్థులుగా ఎన్నికైన వారంతా వైసీపీ మద్దతుదారులే కావడం విశేషం. వీరిలో చోడవరం మండలం సింహాద్రిపురం పంచాయతీ నుంచి దంతులూరి భవానీ, జి.జగన్నాథపురం నుంచి రొంగలి రామారావు, తిమ్మనపాలెం నుంచి గొర్లె రాము ఉన్నారు. అలాగే బుచ్చెయ్యపేట మండలం చింతపాక పంచాయతీ నుంచి గొనజాల శ్రీను, కేపీ అగ్రహారం నుంచి గోపిశెట్టి శ్రీనివాసరావు, చినమదీన నుంచి పచ్చికూర మంగవేణి, కందిపూడి నుంచి కొప్పాక సత్యవతి, తైపురం నుంచి ముచ్చకర్ల శ్రీను, పీపీ అగ్రహారం సర్పంచ్‌గా ఇందల కోటేశ్వరరావు ఎన్నికయ్యారు.

Updated Date - 2021-02-05T07:14:18+05:30 IST