కేజీహెచ్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముమ్మరం

ABN , First Publish Date - 2021-12-28T06:26:22+05:30 IST

కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి అధికారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు.

కేజీహెచ్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముమ్మరం

194 పోస్టులు.. 1083 దరఖాస్తులు

వచ్చే నెల నాలుగు నాటికి పోస్టింగ్‌లు

విశాఖపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి) : కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి అధికారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. 19 విభాగాల్లో ఖాళీగా ఉన్న 194 పోస్టులకు 1083 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించేందుకు 13 మందిని అధికారులు నియమించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. గతంతో పోలిస్తే దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చాయి. రెండు రోజుల్లో ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ డిస్‌ ప్లే చేస్తామని, అభ్యర్థులు ఎవరూ దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి తెలిపారు. జనవరి నాలుగో తేదీలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. ఇదిలావుండగా, ఆడియోమెట్రీ టెక్నీషియన్‌, ఆక్యూపేషనల్‌ థెరఫిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు  ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ నాలుగు విభాగాల్లో 25 పోస్టులు ఉన్నాయి. Updated Date - 2021-12-28T06:26:22+05:30 IST