పార్టీల అగ్ర నేతల దృష్టికి ‘హెటెరో’ పైప్‌లైన్‌ సమస్య

ABN , First Publish Date - 2021-12-28T06:02:11+05:30 IST

రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలోకి విడిచి పెడుతూ, జలాలను కలుషితం చేయడమే కాకుండా, మత్స్యకారుల ఉనికికే ప్రమాదకరంగా హెటెరో ఔషధ పరిశ్రమ మారందని మత్స్యకారులు, అఖిల పక్ష పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీల అగ్ర నేతల దృష్టికి ‘హెటెరో’ పైప్‌లైన్‌ సమస్య
అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్న మత్స్యకారులు

 అఖిల పక్ష నాయకుల సమావేశంలో మత్స్యకారుల వినతి 

ముక్తకంఠంతో మద్దతు

నక్కపల్లి, డిసెంబరు 27 : రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలోకి విడిచి పెడుతూ, జలాలను కలుషితం చేయడమే కాకుండా, మత్స్యకారుల ఉనికికే ప్రమాదకరంగా హెటెరో ఔషధ పరిశ్రమ మారందని మత్స్యకారులు, అఖిల పక్ష పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.  గత 27 రోజుల నుంచి హెటెరో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పైపులైన్లను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు వివిధ రూపాల్లో ఆందో ళను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ధర్నా శిబిరం వద్ద అఖిలపక్ష పార్టీల స్థానిక నాయకులతో మత్స్యకారులు సమావేశం నిర్వహించారు. ఆంధ్ర మత్స్యకార జేఏసీ అధ్యక్షుడు కంబాల అమ్మోరియ్య, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్‌, వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, బీజేపీ నేత పి.రవిరాజు, జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్‌, జాతీయ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు మోసా అప్పలరాజు, సీపీఎం నేత రాజేశ్‌, మత్స్యకారుల నాయకులు పిక్కి స్వామి, పిక్కి కోదండరావు, వాసుపల్లి నూకరాజు తదితరులు హాజరయ్యారు. అధికారులు హెటెరోకు అను కూలంగా వ్యవహరిస్తున్నారని, అందు వల్లే అన్ని పార్టీల అగ్రనాయకుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని మత్స్యకారులు కోరారు.  హెటెరో సంస్థ పైపులైన్లను పూర్తిగా తొలగించే వరకు తాము పోరాటం ఆపేది లేదని మత్స్యకార సంఘ నాయకులు స్పష్టం చేశారు. కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు వల్ల మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి తమ పూర్తి మద్దతు వుంటుందని ఆయన పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-12-28T06:02:11+05:30 IST