స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన సరికాదు
ABN , First Publish Date - 2021-02-06T07:01:41+05:30 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేసే ఆలోచన సరికాదని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు.

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్
అనకాపల్లి, ఫిబ్రవరి 5: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేసే ఆలోచన సరికాదని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఈ కర్మాగారం ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ అనతి కాలంలోనే రూ.21,851 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరిందన్నారు. కర్మాగారంపై 30 వేల మంది ఉద్యోగులతో పాటు మరో 20 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వీరికి అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్, వైసీపీ ప్రజా ప్రతినిధులు తమ కేసుల మాఫీ కోసం కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కొణతాల వెంకటరావు, కుప్పిలి జగన్, డీవీవీ అప్పారావు, కాండ్రేగుల రాజు, మళ్ల గణేశ్, దొడ్డి జగదీశ్వరరావు పాల్గొన్నారు.