షీలానగర్‌ సంత స్థలం మార్పు చేయాలి

ABN , First Publish Date - 2021-05-22T05:09:15+05:30 IST

ప్రమాదాలకు నిలయంగా మారిన షీలానగర్‌ మంగళవారపు సంత స్థలాన్ని శుక్రవారం హరిజన జగ్గయ్యపాలెం, వెంకటేశ్వరకాలనీ నాయకులు పరిశీలించారు.

షీలానగర్‌ సంత స్థలం మార్పు చేయాలి
షీలానగర్‌ సంత స్థలాన్ని పరిశీలిస్తున్న కాలనీ నాయకులు

అక్కిరెడ్డిపాలెం, మే 21: ప్రమాదాలకు నిలయంగా మారిన షీలానగర్‌ మంగళవారపు సంత స్థలాన్ని శుక్రవారం హరిజన జగ్గయ్యపాలెం, వెంకటేశ్వరకాలనీ నాయకులు పరిశీలించారు. ప్రధాన రహదారిపై ఈ సంతను నిర్వహిస్తుండడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతోపాటు పలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు స్పష్టం చేశారు. ఈ సంతను సమీపంలో వున్న కుంచుమాంబ మాన్యంలోకి గాని, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దకు గాని మార్పుచేయాలని కాలనీ నాయకులు కోరుతున్నారు. ఈ సంతను వేరొక చోటకు మార్చేందుకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దృష్టికి తీసుకువెల్లామని, త్వరలోనే తగిన చర్యలు  చేపడతారని స్థానిక వైసీపీ నాయకుడు బోగాది సన్యాసిరావు తెలిపారు. ఈ పర్యటనలో కాలనీ నాయకులు కె సన్యాసిరావు, యు.సుందరరావు, ఎం.కుమార్‌, వి.రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T05:09:15+05:30 IST