కిటకిటలాడిన ఉపమాక వెంకన్న ఆలయం

ABN , First Publish Date - 2021-12-26T05:49:24+05:30 IST

మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. మూలవిరాట్‌కు తెల్లవారుజామున ఆలయ అర్చకులు అభిషేకం, నిత్య ఆరాధన, నివేదనం, మంత్ర పుష్పం సమర్పించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

కిటకిటలాడిన ఉపమాక వెంకన్న ఆలయం
ఉపమాక వేంకటేశ్వరస్వామివారు, దర్శనానికి బారులు తీరిన భక్తులు

నక్కపల్లి, డిసెంబరు 25 : మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. మూలవిరాట్‌కు తెల్లవారుజామున ఆలయ అర్చకులు అభిషేకం, నిత్య ఆరాధన, నివేదనం, మంత్ర పుష్పం సమర్పించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌ ఆచార్యులు, ఇన్ప్‌పెక్టర్‌ పృధ్వీ, రాజశేఖర్‌, రంగనాథస్వామి, అప్పలాచారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T05:49:24+05:30 IST