ఘనంగా కుంచావారి గౌరీపరమేశ్వరుల ఉత్సవం

ABN , First Publish Date - 2021-12-19T06:11:27+05:30 IST

జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన మెయిన్‌ రోడ్డులోని కుంచావారి గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది.

ఘనంగా కుంచావారి గౌరీపరమేశ్వరుల ఉత్సవం
కోలాటాలు ఆడుతున్న మహిళలు

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు, అధికారులు

ఆకట్టుకున్న నేలవేషాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 18: జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన మెయిన్‌ రోడ్డులోని కుంచావారి గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారు జామున అర్చకులు గౌరీపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వీరిని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరుకొండ రాఘవ, కుంచా ఆదిబాబు, బాబూరావు, చిట్టిబాబు సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసీపీ నాయకులు మందపాటి జానకిరామరాజు, కొణతాల భాస్కరరావు ఉన్నారు. అలాగే వైసీపీ నాయకుడు దాడి రత్నాకర్‌ గౌరీపరమేశ్వరులను దర్శించుకోగా, ఆయన్ని ఆలయ కమిటీ సత్కరించింది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరిని కూడా ఆలయ కమిటీ సత్కరించింది. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కాయల మురళీధర్‌, మళ్ల సురేంద్ర, కొణతాల రత్నకుమారి, ఎ.రమణబాబు, బత్తుల శ్రీనివాసరావు, ఎ.అప్పలరాజు ఉన్నారు. అలాగే పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు, ఎస్‌ఐ రామకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆరు గంటలు తరువాత అమ్మవారి అనుపు మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు నేలవేషాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2021-12-19T06:11:27+05:30 IST