రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్‌

ABN , First Publish Date - 2021-10-21T06:45:35+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అన్నారు.

రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్‌
పోలీసుల నిర్బంధంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రాజు

మాజీ ఎమ్మెల్యే రాజు


చోడవరం, అక్టోబరు 20: రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అన్నారు. బంద్‌లో పాల్గొనకుండా పోలీసులు అతన్ని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, జగన్‌ పాలనలో ప్రతి ఒక్కరూ భయంతోనే బతుకున్నారన్నారు. ఇంత మందిని బాధపెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. సహనానికి హద్దు ఉందని, తమ ఓపికను చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులు చేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, మాజీ ఎంపీపీ పెదబాబు, జట్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్స్యరాజు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:45:35+05:30 IST