బ్రాహ్మణ సంక్షేమ నిధి ఏర్పాటు ఘనత టీడీపీదే

ABN , First Publish Date - 2021-08-21T05:19:52+05:30 IST

రాష్ట్రంలో తొలిసారిగా బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు దక్కుతుందని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

బ్రాహ్మణ సంక్షేమ నిధి ఏర్పాటు ఘనత టీడీపీదే
కార్యక్రమంలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య

టీడీపీ ‘విశాఖ’ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, ఆగస్టు 20: రాష్ట్రంలో తొలిసారిగా బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు దక్కుతుందని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ గాజువాక కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ఆగస్టు 20న రాష్ట్ర శాసనసభలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ బిల్లును ప్రవేశపెట్టిన రోజును బ్రాహ్మణ దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య, నాయకులు కిరణ్‌శర్మ, జగన్‌, కృష్ణ, మూర్తి, చిరంజీవి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


Updated Date - 2021-08-21T05:19:52+05:30 IST