నిబంధనలు పాటిస్తేనే కరోనా కట్టడి

ABN , First Publish Date - 2021-05-09T04:58:20+05:30 IST

వైద్యులు, ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను తప్పనిసరిగా పాటించడంతోనే కరోనాను కట్టడి చేయగలమని ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్‌ సేతుపతి మేనల్లుడిగా నటించిన క్రాంతి పేర్కొన్నారు.

నిబంధనలు పాటిస్తేనే కరోనా కట్టడి
నటుడు క్రాంతి

‘ఉప్పెన’ నటుడు క్రాంతి

సింహాచలం, మే 8: వైద్యులు, ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను తప్పనిసరిగా పాటించడంతోనే కరోనాను కట్టడి చేయగలమని ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్‌ సేతుపతి మేనల్లుడిగా నటించిన క్రాంతి పేర్కొన్నారు. శనివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో త్వరలోనే ప్రజలు కరోనాను జయిస్తారని, అందుకు మనమంతా బాధ్యతగా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వడం వంటి వాటిని పాటించాలన్నారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది కూడా అప్పన్న చందనోత్సవాన్ని ఏకాంత సేవగా నిర్వహిస్తున్నందున భక్తులంతా ఇళ్ల వద్దే స్వామివారికి పూజలు చేసుకోవాలని కోరారు.


Updated Date - 2021-05-09T04:58:20+05:30 IST