విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-12-19T06:16:32+05:30 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత అని జనసేన నాయకులు గడసాల అప్పారావు, కరణం కనకారావులు పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత
స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద డిజిటల్‌ క్యాంపెయిన్‌లో పాల్గొన్న జనసేన కార్యకర్తలు

జనసేన డిజిటల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభం

కూర్మన్నపాలెం, డిసెంబరు 18: విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత అని జనసేన నాయకులు గడసాల అప్పారావు, కరణం కనకారావులు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పిలుపు మేరకు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే డిజిటల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా కార్యకర్తలు శనివారం ఉక్కు ఉద్యోగుల, నిర్వాసితుల రిలే నిరాహార దీక్షల శిబిరాలకు విచ్చేసి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తలు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎంపీలు అందరూ పార్లమెంట్‌లో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాదా శ్రీను, కళావతి, మల్లెపూడి మురళీకృష్ణ, పిడుగు బంగారాజు, భాస్కరరాజు, అడపా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-19T06:16:32+05:30 IST