రంగు మారింది..!

ABN , First Publish Date - 2021-12-08T06:08:43+05:30 IST

గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లి ఆర్టీసీ డిపోలోని పల్లె వెలుగు బస్సులకు రంగులు మారాయి.

రంగు మారింది..!
కొత్తగా వేసిన రంగులతో పల్లె వెలుగు బస్సు

ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులకు కొత్త రంగులు

డిపోలో 40 బస్సుల రంగులకు రూ.9.2 లక్షల ఖర్చు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 7: గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లి ఆర్టీసీ డిపోలోని పల్లె వెలుగు బస్సులకు రంగులు మారాయి. ఇప్పటి వరకు పల్లె వెలుగు బస్సులకు తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు ఉండేవి. తాజాగా తెలుపు, సిమెంట్‌, ఆకుపచ్చతో పాటు సన్నటి పసుపు గీతతో బస్సులు దర్శనమిస్తున్నాయి. అనకాపల్లి డిపోలో 40 పల్లె వెలుగు బస్సులు, మరో 24 అద్దె బస్సులు ఉన్నాయి. రెండు రోజులు నుంచి డిపో గ్యారేజీలో ఈ బస్సుల రంగులను మార్చడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రంగుల కోసం ఒక్కొక్క బస్సుకు రూ.23 వేలు ఖర్చవుతుందని అధికారులు అంచనాగా చెబుతున్నారు. ఈ లెక్కన డిపోలోని 40 బస్సులకు రంగులు వేయాలంటే రూ.9.2 లక్షలు ఖర్చు కానుంది. 24 అద్దె బస్సులకు రూ.5.29 లక్షలు ఖర్చు కాగా, ఈ భారాన్ని ఆయా బస్సుల యజమానులే భరించాల్సి ఉంటుంది. అయితే కరోనాతో ఆదాయం భారీగా పడిపోయిన సమయంలో రంగులు మార్చడంతో డిపోపై ఆర్థిక భారం పడుతుందని పలువురు ఉద్యోగులు చర్చించుకోవడం విశేషం.

Updated Date - 2021-12-08T06:08:43+05:30 IST