మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-03-23T04:58:45+05:30 IST

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఆదివారం గల్లంతైన యువకుడి మృతదేహాన్ని సోమవారం వెలికి తీశారు.

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
జగదీప్‌ మృతదేహం

గోపాలపట్నం, మార్చి 22: మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఆదివారం గల్లంతైన యువకుడి మృతదేహాన్ని సోమవారం వెలికి తీశారు. అక్కిరెడ్డిపాలేనికి చెందిన పిల్లల జగదీప్‌ అనే యువకుడు రిజర్వాయర్‌లో ఈతకు దిగి ఆదివారం మఽధ్యాహ్నం గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు యువకుడి కోసం రిజర్వాయర్‌లో గాలించినా ఆచూకీ లభించలేదు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు సోమవారం ఉదయం గాలించి ఎట్టకేలకు రిజర్వాయర్‌ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-23T04:58:45+05:30 IST