నేడు నగరానికి ఉపరాష్ట్రపతి రాక

ABN , First Publish Date - 2021-11-02T06:32:07+05:30 IST

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం నగరానికి రానున్నారు.

నేడు నగరానికి ఉపరాష్ట్రపతి రాక

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం నగరానికి రానున్నారు. ఆయన ఉదయం 9.35 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సబ్బవరంలో గల దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయానికి వెళతారు. యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాగర్‌నగర్‌లో గల ఇంటికి చేరుకుంటారు. సాయంత్రం 3.50 గంటలకు అక్కడ నుంచి విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి పోర్టు గెస్ట్‌ హౌస్‌లోనే బస చేస్తారు. ఈ నెల ఐదో తేదీన ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 6.25 గంటలకు ఏయూలోని డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో జరగనున్న విశాఖ సాహితీ పీఠం గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పోర్టు గెస్ట్‌హౌస్‌ నుంచి విశాఖ ఎయిర్‌ పోర్టుకు, అక్కడి నుంచి పాట్నా వెళ్లనున్నారు. 

Updated Date - 2021-11-02T06:32:07+05:30 IST