తెలంగాణ హైకోర్టు జడ్జిగా సీలేరు గురుకుల పూర్వ విద్యార్థి

ABN , First Publish Date - 2021-08-21T05:47:58+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఎన్‌.తుకారాంజీ విశాఖపట్నం జిల్లా సీలేరు గురుకుల పాఠశాల పూర్వపు విద్యార్థి.

తెలంగాణ హైకోర్టు జడ్జిగా సీలేరు గురుకుల పూర్వ విద్యార్థి

సీలేరు, ఆగస్టు 20: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఎన్‌.తుకారాంజీ విశాఖపట్నం జిల్లా సీలేరు గురుకుల పాఠశాల పూర్వపు విద్యార్థి. ఆయన ఐది నుంచి పదో తరగతి వరకు ఇక్కడ చదువుకున్నారు. ఆయన ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా ఉన్నారు. ఈ సందర్భంగా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ విజయమోహనరావు మాట్లాడుతూ తమ పూర్వపు విద్యార్థి తుకారాంజీ తెలంగాణ హైకోర్టు నాయమూర్తిగా ఎంపిక కావడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. 

Updated Date - 2021-08-21T05:47:58+05:30 IST