కరోనాతో ఉపాధ్యాయుడి మృతి
ABN , First Publish Date - 2021-05-21T14:46:31+05:30 IST
కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల..

కశింకోట(విశాఖపట్నం): కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పి.శ్రీధర్ కరోనాతో గురువారం మృత్యువాత పడ్డారు. ఇటీవల కరోనా సోకిన శ్రీధర్ విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు చెప్పారు. అతని మృతిపై మండల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.