‘ఓటీఎస్‌’పై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-12-28T06:08:32+05:30 IST

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరిట పేదలను పీడించవద్దని ప్రభుత్వానికి తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఓటీఎస్‌కు వ్యతిరేకంగా సోమవారం విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీల నేతృత్వంలో నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఓటీఎస్‌ నిమిత్తం ఎవరూ డబ్బులు కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారుల పేరిట ఇళ్లు ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేస్తామని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. పాదయాత్ర అనంతరం ‘స్పందన’ కార్యక్రమంలో వున్న కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

‘ఓటీఎస్‌’పై టీడీపీ నిరసన

పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్ర

పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేస్తామని ప్రకటన

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరిట పేదలను పీడించవద్దని ప్రభుత్వానికి తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఓటీఎస్‌కు వ్యతిరేకంగా సోమవారం విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీల నేతృత్వంలో నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఓటీఎస్‌ నిమిత్తం ఎవరూ డబ్బులు కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారుల పేరిట ఇళ్లు ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేస్తామని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. పాదయాత్ర అనంతరం ‘స్పందన’ కార్యక్రమంలో వున్న కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T06:08:32+05:30 IST