గవర్నర్ హరిబాబుకు టీడీపీ నేతల అభినందనలు
ABN , First Publish Date - 2021-07-08T06:32:12+05:30 IST
మిజోరం గవర్నర్‌గా నియమితులైన డాక్టర్ కంభంపాటి హరిబాబును బుధవారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు కలిసి అభినందనలు తెలిపారు.

సిరిపురం, జూలై 7: మిజోరం గవర్నర్‌గా నియమితులైన డాక్టర్ కంభంపాటి హరిబాబును బుధవారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు విశాఖ ఎంపీగా హరిబాబు అందించిన సేవలను కొనియాడారు. గవర్నర్‌గా మిజోరం ప్రజల జీవితాల్లో డాక్టర్ హరిబాబు వెలుగులు నింపగలరన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాళ్ల శంకర్, గొలగాని పోలారావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.