పీఆర్‌ మోహన్ హఠాన్మరణంపై సోమిరెడ్డి విచారం

ABN , First Publish Date - 2021-07-12T17:56:44+05:30 IST

టీడీపీ సీనియర్ నాయకులు, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ హఠాన్మరణంపై పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పీఆర్‌ మోహన్ హఠాన్మరణంపై సోమిరెడ్డి విచారం

అమరావతి: టీడీపీ సీనియర్ నాయకులు, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ హఠాన్మరణంపై పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయామన్నారు. తనకు ఎంతో ఆత్మీయుడైన మోహన్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్ మోహన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని సోమిరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-07-12T17:56:44+05:30 IST