రైతు ద్రోహి సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-01-14T04:38:59+05:30 IST

రైతులకు సంక్రాంతిని దూరం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోనున్నారని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ విమర్శించారు.

రైతు ద్రోహి సీఎం జగన్‌
రైతు వ్యతిరేక జీవో కాపీలు దహనం చేస్తున్న టీడీపీ నాయకులు

తన తీరుతో చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు

సంక్రాంతి ముందు అన్నదాత ఉసురుపోసుకున్నారు

నష్టపరిహారం, బీమా సొమ్ము చెల్లించకుండా అన్యాయం

విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ 

భోగి మంటల్లో రైతు జీవో కాపీలు దహనం చేసిన నాయకులు

విశాఖపట్నం, జనవరి 13: రైతులకు సంక్రాంతిని దూరం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోనున్నారని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ విమర్శించారు. టీడీపీ జాతీయ విభాగం ఆదేశానుసారం బుధవారం విశాఖనగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి అందులో రైతు వ్యతిరేక జీవో కాపీలు దహనం చేశారు.


ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ పంట నష్టపరిహారం, బీమా, ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించని జగన్‌ ప్రభుత్వం రైతులకు ముందే సంక్రాంతి తెచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రకృతి విపత్తులతో రైతులు దాదాపు రూ.10వేల కోట్లు నష్టపోతే ప్రభుత్వం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా ప్రభుత్వం అన్నదాతకు అన్యాయం చేసిందన్నారు.


ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌నజీర్‌, పార్టీ నాయకులు నక్కా కనకరాజు, వానపల్లి రవికుమార్‌, పి.ప్రసాద్‌, రామానంద్‌, ప్రణవ్‌గోపాల్‌, డోకర రమణ, బాపూఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T04:38:59+05:30 IST