జల్‌జీవన్‌ మిషన్‌లో ఇంటింటికీ కుళాయి

ABN , First Publish Date - 2021-09-02T05:56:29+05:30 IST

మండలంలోని ప్రతి ఇంటికి రానున్న రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ పఽథకం జల్‌జీవన్‌ మిషన్‌ కింది మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ఎంపీడీవో రమేశ్‌నాయుడు తెలిపారు.

జల్‌జీవన్‌ మిషన్‌లో ఇంటింటికీ కుళాయి
అధికారులతో మాట్లాడుతున్న ఎంపీడీవో రమేశ్‌నాయుడు

సబ్బవరం, సెప్టెంబరు 1 : మండలంలోని ప్రతి ఇంటికి రానున్న రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ పఽథకం జల్‌జీవన్‌ మిషన్‌ కింది మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ఎంపీడీవో రమేశ్‌నాయుడు తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా ప్రాజెక్టు మానెటరింగ్‌(డీపీఎం) ఏజెన్సీ ప్రతినిధులు చైతన్య, ఐఎస్‌ఎ పుల్లయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హిమబిందుతో ప్రాజెక్టు వివరాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు కింద రూ.12.62 కోట్లు మంజూరయ్యాయన్నారు. మండలంలో 70 గ్రామాలకు గానూ 61 గ్రామాల్లోని 15,389 ఇళ్లకు రానున్న రెండేళ్లలో కుళాయిలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే కుళాయిలు అవసరమైన ఇళ్లను గుర్తిం చామన్నారు. కుళాయిలు ఏర్పాటు చేసిన తరువాత పంచాయతీల నిర్వహణలో ఉంటాయన్నారు. వీటి నిర్వహణకు ప్రతి పంచాయతీలో 8 నుంచి 15 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.  సర్పంచ్‌ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పంచాయతీ కార్యదర్శి వ్యవహరిస్తారని తెలిపారు. 

Updated Date - 2021-09-02T05:56:29+05:30 IST