కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-03-25T04:45:09+05:30 IST
ఇటీవల ఆంధ్రాయూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ముత్యాలమ్మపాలెంనకు చెందిన బ్రూస్‌లీ రాజు మెమోరియల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన 25 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 23 బంగారు, 8 రజిత, 14 కాంస్య పతకాలతో మొత్తం 45 మెడల్స్ సాధించారు.

పరవాడ, మార్చి 24: ఇటీవల ఆంధ్రాయూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ముత్యాలమ్మపాలెంనకు చెందిన బ్రూస్‌లీ రాజు మెమోరియల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన 25 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 23 బంగారు, 8 రజిత, 14 కాంస్య పతకాలతో మొత్తం 45 మెడల్స్ సాధించారు. బెస్ట్ అకాడమీ ఆఫ్ ది చాంపియన్‌షిప్‌ను కైవశం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం అభినందనసభ నిర్వహించారు. సర్పంచ్ చింతకాయల సుజాతముత్యాలు, మాజీ సర్పంచ్ చింతకాయల ముత్యాలు, అప్పన్న, ధనలక్ష్మి, చీఫ్ కోచ్ అప్పలరాజు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఎర్రబాబు, అప్పలరాజు, సోంబాబు, ఎ.అప్పలరాజు, శివ, శివాజీ, శైలజ తదితరులు పాల్గొన్నారు.