కరోనాతో కళతప్పిన తాజంగి రిజర్వాయర్‌

ABN , First Publish Date - 2021-05-10T04:42:23+05:30 IST

పర్యాటకులతో కళకళలాడే తాజంగి రిజర్వాయర్‌ కరోనా కారణంగా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నది.

కరోనాతో కళతప్పిన తాజంగి రిజర్వాయర్‌
నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న తాజంగి రిజర్వాయర్‌


చింతపల్లి, మే 9: పర్యాటకులతో కళకళలాడే తాజంగి రిజర్వాయర్‌ కరోనా కారణంగా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నది. ప్రతీ ఏటా శీతాకాలంలో లంబసింగికి వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శించిన విషయం తెలిసిందే. అరకు మాదిరిగా ఏడాది పొడవున లంబసింగి ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శించే విధంగా తాజంగి రిజర్వాయర్‌ వద్ద ఐటీడీఏ, పర్యాటక వికాస్‌ సాహస క్రీడలను ఏర్పాటుచేసింది. చుట్టు పచ్చని కొండలు, సుమారు 100 ఎకరాలుపైబడిన రిజర్వాయర్‌, విశాలమైన చల్లని వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చాలు సాయంత్రం, ఉదయం వేళల్లో పర్యాటకులు రిజర్వాయర్‌లో సేదదీరేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే కరోనా కారణంగా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తాజంగి రిజర్వాయర్‌ వద్ద సాహస క్రీడలు జిప్‌లైన్‌, బోటుషికార్‌ని మూయించి వేశారు. ప్రస్తుతం సందర్శకుల తాకిడి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తాజంగి రిజర్వాయర్‌ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నది. 

Updated Date - 2021-05-10T04:42:23+05:30 IST