జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీకి జిల్లా క్రీడాకారులు

ABN , First Publish Date - 2021-01-13T05:57:54+05:30 IST

వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో పాల్గొనే ఆంధ్ర రాష్ట్ర జట్టుకు విశాఖ క్రీడాకారులు ఎంపికయ్యారు

జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీకి జిల్లా క్రీడాకారులు
క్రీడాకారులను అభినందిస్తున్న మంత్రి ముత్తంశెట్టి

అభినందించిన మంత్రి ముత్తంశెట్టి

విశాఖపట్నం(స్పోర్ట్సు), జనవరి 12: వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో పాల్గొనే ఆంధ్ర రాష్ట్ర జట్టుకు విశాఖ క్రీడాకారులు ఎంపికయ్యారు. సీనియర్‌ విభాగంలో టి.శ్రీకాంత్‌రాజు(రైల్వేస్‌), మోహిత్‌ శర్మ,  బాలుర జూనియర్‌ యూత్‌ కేటగిరీలో ఎం.ప్రగ్యాన్‌, బాలికల సబ్‌ జూనియర్‌  విభాగంలో వీజీ సంయుక్త,  బి.హాసిని, బాలుర సబ్‌ జూనియర్‌  విభాగంలో ఎస్‌.సెంథిల్‌ నాధన్‌, బాలుర యూత్‌ విభాగంలో సీహెచ్‌.దత్త అవినాష్‌, బాలికల జూనియర్‌ విభాగంలో ఎంఎల్‌ఎస్‌ సౌమ్య, బాలుర జూనియర్‌  కేటగిరీలో మణికుమార్‌, క్యాడెట్‌ బాలుర కేటగిరీలో హితేశ్‌ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం తన కార్యాలయంలో జాతీయ టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌, జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘం కార్యదర్శి డీవీఎస్‌ శర్మ, కోచ్‌ వైఎస్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-13T05:57:54+05:30 IST