అమ్మ ప్రేమకు చిహ్నాలు..
ABN , First Publish Date - 2021-05-09T04:55:22+05:30 IST
మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి ఆదివారం ప్రపంచ మాతృమూర్తి దినో త్సవాన్ని పురస్కరించుకుని తనలోని అద్భుత కళానైపుణ్యాన్ని ఆవిష్కరించాడు.

నక్కపల్లి, మే 8 : మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి ఆదివారం ప్రపంచ మాతృమూర్తి దినో త్సవాన్ని పురస్కరించుకుని తనలోని అద్భుత కళానైపుణ్యాన్ని ఆవిష్కరించాడు. చెక్కపై ఐదు రకాలలో మాతృమూర్తి, తల్లీ,బిడ్డల రూపాలను అత్యద్భుతంగా చెక్కి అమ్మ ప్రేమను అందరికీ చాటిచెప్పాడు. వీటి తయారీకి తనకు ఏడు గంటల సమయం పట్టినట్టు వివరించాడు.