సింహాచలేశునికి స్వర్ణ సంపెంగల పూజ
ABN , First Publish Date - 2021-10-29T05:51:19+05:30 IST
సింహగిరిపై కొలువుదీరిన వరాహలక్ష్మీనృసింహస్వామిని స్వర్ణ సంపెంగలతో పూజలు చేశారు.
సింహాచలం, అక్టోబరు 28: సింహగిరిపై కొలువుదీరిన వరాహలక్ష్మీనృసింహస్వామిని స్వర్ణ సంపెంగలతో పూజలు చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా గురువారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రభాత ఆరాధనలు యథావిధిగా జరిపాక ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని కళ్యాణ మండపంలోని ముత్యాల పందిరిలో అధిష్టింపజేశారు. ఆలయ ముఖ్య అర్చకుడు సాతులూరి నరసింహాచార్యులు పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి షోడశోపచారాలు సమర్పించారు. నృసింహ అష్టోత్తర శతనామావళి పఠిస్తూ స్వర్ణ సంపెంగలతో స్వామివారిని పూజించారు.