అప్పన్నకు స్వర్ణ సంపెంగల పూజ

ABN , First Publish Date - 2021-11-22T05:25:33+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామికి ఆదివారం కన్నుల పండువగా స్వర్ణ సంపెంగల పూజ నిర్వహించారు.

అప్పన్నకు స్వర్ణ సంపెంగల పూజ
పూజలందుకున్న గోవిందరాజస్వామి

సింహాచలం, నవంబరు 21: సింహాద్రి అప్పన్న స్వామికి ఆదివారం కన్నుల పండువగా స్వర్ణ సంపెంగల పూజ నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా వేకువజామున స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ప్రభాత ఆరాధన లను యథావిధిగా చేశాక ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయదేవేరులతో కళ్యాణ మండపంలో ఉంచారు. భక్తుల గోత్రనామాలతో అర్చకుడు పవన్‌కుమారాచార్యులు షోడశోపచారాలు సమర్పించారు. నృసింహ అష్టోత్తర శతనామావళి పఠిస్తూ స్వర్ణ సంపెంగలతో పూజ చేశారు. భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అలాగే సింహాచలేశునికి వైభవంగా గరుడసేవ నిర్వహించారు. రజిత గరుడ వాహనంపై ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని అధిష్టింపజేసి పూజల్లో పాల్గొన్న జంటల గోత్రనామాలతో పూజలు జరిపారు. 


Updated Date - 2021-11-22T05:25:33+05:30 IST