ఎండ ‘మండే’

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

రుతుపవనాల ఆగమనం వేళ అగ్గి పుడుతుండడం అందరిలో ఒకింత ఆశ్చర్యం, ఆందోళన పుడుతోంది.

ఎండ ‘మండే’
నిర్మానుష్యంగా ఉన్న మాకవరపాలెం రోడ్డు

మాకవరపాలెం/ కృష్ణాదేవిపేట/  నర్సీపట్నం అర్బన్‌/ గొలుగొండ, జూన్‌ 21 : రుతుపవనాల ఆగమనం వేళ అగ్గి పుడుతుండడం అందరిలో ఒకింత ఆశ్చర్యం, ఆందోళన పుడుతోంది. వాస్తవంగా ఏటా రోహిణి కార్తె అనంతరం మృగశిర కార్తె ప్రవేశం నాటి నుంచి వాతావరణం చల్లబడడం ఆరంభమవుతుంది. కానీ సోమవారం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిం చింది. ఉదయం తొమ్మిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. మండు వేసవి వలే నిప్పులు కక్కాడు. దీనికితోడు వడగాడ్పులు మరింత భయ పెట్టాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు ఇదే వాతావరణం కొనసాగడంతో జనం ఉక్కిరి బిక్కిర య్యారు. పిల్లలు, వృద్ధులు అవస్థలుపడ్డారు. చాలా చోట్ల మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత రోడ్లు బోసిపోయి కనిపించాయి. కర్ఫ్యూ సడలింపులు ఉద యం ఆరు నుంచి సాయంత్ర ఆరు గంటల వరకు ఉన్నా చాలా మంది ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే హడలిపోయారు. 

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST