ఐక్య ఉద్యమాలతో విజయం తథ్యం
ABN , First Publish Date - 2021-12-15T06:22:10+05:30 IST
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ, వేతనాల సవరణకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తే విజయం తథ్యమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు.

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు
కూర్మన్నపాలెం, డిసెంబరు 14: స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ, వేతనాల సవరణకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తే విజయం తథ్యమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 306వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షలలో డబ్ల్యూఆర్‌ఎం, ఎల్‌ఎంఎం, ఆర్‌అండ్‌ఆర్‌ఎస్ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో వరసాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మరో నాయకుడు గంధం వెంకటరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం ప్రభుత్వ రంగంలోనే ఉంటుందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, అయోధ్యరామ్, వై.టి.దాస్, కె.ఎస్.ఎన్.రావు, వేములపాటి ప్రసాద్, గంగవరం గోపి, జి.ఆనంద్, సత్యనారాయణ, పసాధ్ తదితరులు పాల్గొన్నారు.