సచివాలయాలను తనిఖీ చేసిన సబ్‌కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-07T05:36:28+05:30 IST

మండలంలో మేజర్‌ పంచా యతీ పెదలబుడు, పద్మాపురం పంచాయతీల పరిధిలోని ఐదు సచివాలయాలను పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సచివాలయాలను తనిఖీ చేసిన సబ్‌కలెక్టర్‌
సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌


అరకులోయ, డిసెంబరు 6: మండలంలో మేజర్‌ పంచా యతీ పెదలబుడు, పద్మాపురం పంచాయతీల పరిధిలోని ఐదు సచివాలయాలను పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల సేవలపై ఆరా తీశారు. నవ రత్నాల అమలు, లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. పెదలబుడు-2 సచివాలయానికి సంబంధించిన వివరాలను పంచాయతీ కార్యదర్శి శేఖర్‌బాబు వివరించారు. అదేవిధంగా పెదలబుడు, పానిరంగి, పద్మాపురం, యండపల్లివలస సచివాలయాలను తనిఖీ చేశారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌ ధరించేలా, భౌతిక దూరంగా పాటించేలా అవగాహన కల్పించాలని సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌ ఆదేశించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ అర్హునికి అందేలా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో జీవీ.రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు శేఖర్‌బాబు, రాంబాబు ఉన్నారు.


Updated Date - 2021-12-07T05:36:28+05:30 IST