స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-03-24T05:47:02+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని అడ్డరోడ్డు-తిమ్మాపురంలో మంగళవారం డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
అడ్డరోడ్డులో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపడుతున్న విద్యార్థులు

డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం


ఎస్‌.రాయవరం, మార్చి 23: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని అడ్డరోడ్డు-తిమ్మాపురంలో మంగళవారం డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. అంతకుముందు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.  పాత హైవే జంక్షన్‌ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజేశ్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రకాశ్‌, నానాజీ, కొమ్మి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-24T05:47:02+05:30 IST