నగరంలో పారిశుధ్యం మెరుగుకు పటిష్ట చర్యలు
ABN , First Publish Date - 2021-07-08T05:55:35+05:30 IST
నగరంలో పారిశుధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెడతామని నగర మేయరు గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జీవీఎంసీ కమిషనర్ సృజనతో కలసి బుధవారం ఆమె 95వవార్డు పరిధి పురుషోత్తపురం, పాపయ్యరాజుపాలెం, ఎల్‌ఐసీ కాలనీ, ఎన్‌ఏడీ కాలనీలలో పర్యటించారు.

మేయర్ గొలగాని హరి వెంకటకుమారి
పెందుర్తిరూరల్, జూలై 7: నగరంలో పారిశుధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెడతామని నగర మేయరు గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జీవీఎంసీ కమిషనర్ సృజనతో కలసి బుధవారం ఆమె 95వవార్డు పరిధి పురుషోత్తపురం, పాపయ్యరాజుపాలెం, ఎల్‌ఐసీ కాలనీ, ఎన్‌ఏడీ కాలనీలలో పర్యటించారు. పారిశుధ్యం పరిస్థిలను ప్రత్యేకంగా పరిశీలించారు. స్థానిక కార్పొరేటరు ముమ్మన దేముడు మురుగు నీటి సమస్యను మేయర్, అధికారులకు వివరించారు. కృష్ణరాయపురం నుంచి పురుషోత్తపురం హౌసింగ్ బోర్డు కాలనీల మీదుగా మిలట్రీ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గోడ నిర్మించేయడంతో మురుగునీటి ప్రవాహానికి అవరోధం ఏర్పడుతోందన్నారు. ఈ సందర్భంగా నిలిచిన మురుగును మేయర్ పరిశీలించారు. మిలట్రీ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతామని, వీలు కాకుంటే ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించాలని ప్రజారోగ్యశాఖ అధికారులకు సూచించారు. కాలనీలో రహదార్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. జడ్సీ చక్రవర్తి, సహాయ ఆరోగ్యాధికారి డాక్టర్ లక్ష్మీతులసి, ఇంజనీరింగ్ అధికారులు, వైసీపీ నేతలు చిప్పల చందు, రాపర్తి మాధవరావు, వెంకటపతిరాజు, సూరిబాబు, సాయి, చందూయాదవ్, విజయ్, బుజ్జి, శ్రీను, నూకరాజు, చినబాబు పాల్గొన్నారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
పరవాడ: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ సూచించారు. జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెం శివారు జాజులవానిపాలెం కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 79వ వార్డులో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం చూపాలన్నారు. ఈ సమావేశంలో 79వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అప్పికొండ మహలక్ష్మినాయుడు, కాసు అంజి రెడ్డి, పైలా శ్రీనివాసరావు, పైలా సన్యాసిరాజు, పైలా అప్పలనాయుడు, చల్లా కనకారావు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.