ఆలయాల భద్రతకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2021-01-20T05:40:28+05:30 IST

జిల్లాలో ఆలయాలకు భద్రత మరింత పటిష్టం చేశామని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు చెప్పారు.

ఆలయాల భద్రతకు పటిష్ట చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కృష్ణారావు

జిల్లా ఎస్పీ కృష్ణారావు


అనకాపల్లి టౌన్‌, జనవరి 19: జిల్లాలో ఆలయాలకు భద్రత మరింత పటిష్టం చేశామని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు చెప్పారు. గవరపాలెం వీవీ రమణ రైతుభారతి కల్యాణ మండపంలో మంగళవారం ‘ప్రార్థనా మందిరాల సంరక్షణలో గ్రామ రక్షణ దళం బాధ్యత’ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటైన దళాలు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వారికి పోలీసు శాఖ తరపున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లాలో మూడు వేలకు పైగా ఆలయాలు, చర్చిలు, మశీదులు ఉన్నాయని, వాటిలో 200 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మిగిలిన చోట్ల కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేబాక సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శి విజయలక్ష్మి గ్రామంలోని ఆలయానికి రెండు సీసీ కెమెరాలు ఇవ్వడంతో ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.శ్రావణి, సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు ఎల్‌.రామకృష్ణ, ఆర్‌.ధనుంజయ్‌, డి.ఈశ్వరరావు, శ్రీనివాసరావు, సురేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-20T05:40:28+05:30 IST