దేశాభివృద్ధిలో ఉక్కు పరిశ్రమలు కీలకం

ABN , First Publish Date - 2021-10-20T07:02:56+05:30 IST

దేశాభివృద్ధిలో ఉక్కు పరిశ్రమలు కీలకమని స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన అప్రెంటీస్‌ ట్రైనీల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

దేశాభివృద్ధిలో ఉక్కు పరిశ్రమలు కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌

స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 19:  దేశాభివృద్ధిలో ఉక్కు పరిశ్రమలు కీలకమని స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన అప్రెంటీస్‌ ట్రైనీల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ కేవలం ఉక్కు ఉత్పత్తికి మాత్రమే కాకుండా పవర్‌ప్లాంట్‌ వంటి రంగాలకు విస్తరించిందన్నారు. అప్రెంటీస్‌లు కేవలం నేర్చుకోవటానికి పరిమితం కాకుండా దేశాభివృద్ధిలో పాల్గొనాలన్నారు. అంకితభావంతో మెలిగి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పని ప్రదేశంలో భద్రతా పనిముట్లను తప్పకుండా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఏకే సక్సేనా, ఈడీ(వర్క్స్‌) కేవీ విద్యాసాగర్‌, ట్రైనింగ్‌ విభాగాధిపతి ఎన్‌.భాను పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T07:02:56+05:30 IST