ఆలయాలకు ఆధ్మాత్మిక శోభ
ABN , First Publish Date - 2021-10-21T06:46:33+05:30 IST
రాష్ట్రంలో అన్ని ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ చేకూర్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్ తెలిపారు.

దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్
చోడవరం, అక్టోబరు 20: రాష్ట్రంలో అన్ని ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ చేకూర్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆలయాల్లో ప్రత్యేక విగ్రహాల ఏర్పాటుతో పాటు చరిత్ర తెలిపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే 117 ఆలయాల్లో పనులు మొదలు పెట్టామన్నారు. అలాగే ఆలయాల భూములతో పాటు ఆస్తుల పరిరక్షణ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పారు. కాగా, ఆలయానికి వచ్చిన కార్యదర్శికి దేవదాయ శాఖ ఈవో సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆ శాఖ ఏసీ శాంతి, ఇతర అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకుడు కొడమంచిలి చలతి పాల్గొన్నారు.