విశాఖ- బ్రహ్మపూర్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2021-12-31T05:52:06+05:30 IST
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ, బ్రహ్మపూర్, సికింద్రాబాద్ మధ్య రానుపోను ఒక ట్రిప్పు ప్రత్యేక రైలు ప్రవేశపెడుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబరు 30: ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ, బ్రహ్మపూర్, సికింద్రాబాద్ మధ్య రానుపోను ఒక ట్రిప్పు ప్రత్యేక రైలు ప్రవేశపెడుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు. 07485 నంబరు రైలు జనవరి 9న (ఆదివారం)సాయంత్రం 5.50 గంటలకు సికిం ద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు విశాఖ, అక్కడ నుంచి 6.50 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు బ్రహ్మపూర్ చేరుతుందని చెప్పారు.
తిరుగు ప్రయాణంలో 07486 నంబరు రైలు జనవరి 10న (సోమవారం) మధ్యా హ్నం ఒంటి గంటకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు విశాఖ,మర్నాడు ఉద యం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంద న్నారు. ఈ సర్వీసులో ఒక సెకండ్ ఏసీ, మూడు థర్డ్‌ఏసీ, 12స్లీపర్, నాలుగు జనరల్ సెకండ్ క్లాసు, రెండు సెకండ్ క్లాసు కమ్ లగేజి కోచ్‌లుంటాయి. ఈ రైలు ఖాజీపేట, వరంగల్, కొండపల్లి, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు (17016) అదనంగా ఒక సెకండ్ ఏసీ కోచ్, సికింద్రాబాద్-విశాఖ-గరీబ్‌రథ్ (12740)కు అదనంగా థర్డ్ ఏసీ, విశాఖ-కాచిగూడ (12861) ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా ఒక సెకండ్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నట్టు సీనియర్ డీసీఎం తెలిపారు.