గర్భిణులకు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ప్రత్యేక సేవలు

ABN , First Publish Date - 2021-05-19T04:56:19+05:30 IST

స్థానిక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో గర్భిణులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక్కో గర్భిణికి ఒక్కో గదిని కేటాయించడంతోపాటు వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు.

గర్భిణులకు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ప్రత్యేక సేవలు
పాడేరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో గర్భిణులకు సూచనలిస్తున్న వైద్యులు


పాడేరు, మే 18: స్థానిక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో గర్భిణులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక్కో గర్భిణికి ఒక్కో గదిని కేటాయించడంతోపాటు వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. అలాగే గర్భిణుల ఆరోగ్య రక్షణ, ఇతర సేవలకై సీనియర్‌ డాక్టర్‌ టి.విశ్వేశ్వరరావునాయుడు, డాక్టర్‌ శ్యామ్‌లను నియమించారు. ప్రస్తుతం పెదబయలు, హుకుంపేట మండలాలకు చెందిన ముగ్గురు కొవిడ్‌ బాధిత గర్భిణులు స్థానిక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేరి సేవలు పొందుతున్నారు. వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, రక్తహీనతను అధిగ మించేందుకు నాణ్యమైన పోషకాహారం అందిస్తూ, అవసరమైన మందులు వేయిస్తున్నారు. ఏజెన్సీలో కొవిడ్‌ సోకిన గర్భిణులు కేర్‌ సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-19T04:56:19+05:30 IST