రక్తదాన శిబిరానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2021-10-29T06:14:20+05:30 IST

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శారదానగర్‌ శ్రీనివాస కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.

రక్తదాన శిబిరానికి విశేష స్పందన
రక్తదానం చేస్తున్న పోలీసు అధికారులు, యువకులు

79 మంది రక్తదానం


అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 28: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శారదానగర్‌ శ్రీనివాస కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.  సర్వేజన ఐక్యవేదిక అధ్యక్షుడు కోరిబిల్లి పరమేశ్‌ ఆధ్వర్యంలో సూర్య అభయాంజనేయ బ్లడ్‌ బ్యాంక్‌, ఎన్టీఆర్‌ వైద్యాలయం వైద్యులు, సిబ్బంది సహకారంతో జరిగిన శిబిరాన్ని డీఎస్పీ బి.సునీల్‌ ప్రారంభించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు పట్టణానికి చెందిన యువకులు 79 మంది రక్తదానం చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. రక్తదాతలను డీఎస్పీ సునీల్‌ అభినందించారు. కార్యక్రమంలో సీఐలు ఎల్‌.భాస్కరరావు, జి.శ్రీనివాసరావు, సిహెచ్‌.ప్రసాద్‌, ఎస్‌ఐలు ఎల్‌.రామకృష్ణ, ఈశ్వరరావు, ఐక్యవేదిక బృందం పాల్గొన్నారు. కాగా, నెహ్రూచౌక్‌లో పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. విశాఖ ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌ పోలీసు విభాగం నుంచి ప్రత్యేకంగా వచ్చిన బ్యాండ్‌ పార్టీ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్‌చక్ర అవార్డు గ్రహీత కరణం వరప్రసాద్‌, మరి కొంతమంది చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

Updated Date - 2021-10-29T06:14:20+05:30 IST