ముత్యాలమ్మకు విశేష పూజలు

ABN , First Publish Date - 2021-03-25T04:44:06+05:30 IST

వేపగుంట పరిసర ప్రాంతాల ఆరాధ్య దేవత ముత్యాలమ్మ అమ్మవారి పండుగ ఘనంగా ప్రారంభమయింది. బుధవారం అమ్మవారి తొలేళ్ల ఉత్సవం నిర్వహించారు.

ముత్యాలమ్మకు విశేష పూజలు
గాజులతో అమ్మవారి ఊయలను తిర్చిదిద్దిన దృశ్యం

వేపగుంట మార్చి 24: వేపగుంట పరిసర ప్రాంతాల ఆరాధ్య దేవత ముత్యాలమ్మ అమ్మవారి పండుగ ఘనంగా ప్రారంభమయింది. బుధవారం అమ్మవారి తొలేళ్ల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను వేపగుంట రామాలయం నుంచి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాయంత్రం ఆలయంలో మహిళా భక్తులు కోలాటం ఆడారు. పండుగ సందర్భంగా ఆలయ ఆవరణ, అంతరాలయం గాజులతో అలంకరించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని అర్చకులు శేషాద్రి శర్మ తెలిపారు. 

Updated Date - 2021-03-25T04:44:06+05:30 IST