గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-12-26T05:30:00+05:30 IST

పెదజాలారిపేట సాగరతీరంలో మత్స్యకారులు ఆదివారం గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.

గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు
గంగమ్మతల్లికి పూజలు చేస్తున్న దృశ్యం

పెదవాల్తేరు, డిసెంబర్‌ 26: పెదజాలారిపేట సాగరతీరంలో మత్స్యకారులు ఆదివారం గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. 2004 డిసెంబరు 26న సునామీ వచ్చినప్పటి నుంచి ప్రతీ సంవత్సరం పెదజాలారిపేట సాగరతీరంలో మత్స్యకారులు గంగమతల్లికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం వందలాది మంది మత్స్యకార మహిళలు కలశాలతో తీసుకువచ్చిన పాలు, పసుపు నీళ్లను సముద్రంలో కలిపి పూజలు చేశారు. ముందుగా పెదజాలారిపేట గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి పలు వీధుల మీదుగా ఊరేగింపుగా తీరానికి చేరుకుని గంగమ్మతల్లికి క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మత్స్యకార గ్రామ పెద్ద పరసన్న ఆధ్వర్యంంలో పూజాది కార్యక్రమాలు జరిగాయి. తామంతా సముద్రంపైనే ఆధారపడి బతుకుతున్నామని, తమపై అనుగ్రహం చూపాలని మత్స్యకారులంతా గంగమ్మతల్లిని వేడుకున్నారు. వందలాది మంది గంగపుత్రులు తీరానికి చేరుకోవడంతో ఈ ప్రాంతంలో సందడి వాతావారణం నెలకొంది. 


Updated Date - 2021-12-26T05:30:00+05:30 IST